TSPSC వెబ్ సైట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. టీఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాక్ చేశారు కొందరు సైబర్ కేటుగాళ్లు. TSPSC వెబ్ సైట్ హ్యాక్ కావడంతో…. తెలంగాణలో మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా వేసింది టీఎస్‌పీఎస్సీ.
ఇక మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష సైతం వాయిదా వేసినట్టు తెలిపింది TSPSC కమిషన్. టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు TSPSC అధికారులు. దీంతో టిఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాకింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అటు వాయిదా పడిన పరీక్షల తేదీలు మళ్లీ ప్రకటిస్తామని తెలిపింది టీఎస్‌పీఎస్సీ. ఇక ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.