ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఫొటో, సంతకం, పేరు, మీడియంతో పాటు ఏయే సబ్జెక్టులు రాస్తున్నామో వాటిని గమనించాలని, వాటిలో ఏవైనా తప్పులు ఉంటే తక్షణమే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఈ క్రమంలోనే హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్స్ సంతకాలు లేకపోయినప్పటికీ పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఇంటర్ బోర్డు చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. మే 24న సెకండ్ లాంగ్వేజ్, 25న ఇంగ్లీషు పేపర్, 28న మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్, 29న మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ, 30న ఫిజిక్స్, ఎకనామిక్స్ 31న కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు.. జూన్ 01న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జీ కోర్సు మ్యాథ్స్, జూన్ 03న మోడరన్ లాంగ్వెజీ, జాగ్రఫీ పరీక్షలు జరుగనున్నాయి.