10 వేల మందిని దించుతానని హరీష్ వార్నింగ్..దిగివచ్చిన పోలీసులు !

-

జన సందోహం మధ్య అర్థరాత్రి హైదరాబాద్ బయలుదేరారు హరీష్ రావు. మద్దతుగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కౌశిక్‌ రెడ్డి పంచాయితీ నేపథ్యంలోనే.. హరీష్‌ రావుతో పాటు.. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అరెస్ట్‌ అయ్యారు. హైదరాబాద్‌ లో అరెస్ట్‌ చేసి.. కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో… కేశంపేట పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది.

Harish Rao and the BRS leaders were finally released by the police from the Keshampet police station

BRS కార్యకర్తల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నారు పోలీసులు. ఈ తరునంలోనే.. సీఎం డౌన్ డౌన్ అంటూ కేశంపేట పోలీస్ స్టేషన్ పరిసరాలు మార్మోగాయి. అటు 10 వేల మందిని కేశంపేట పోలీస్ స్టేషన్ ముందు దింపుతానని హెచ్చరించారు హరీష్ రావు. దీంతో బయపడ్డ..ఎట్టకేలకు హరీష్ రావు మరియు BRS నాయకులను కేశంపేట పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news