చాలామందికి నిత్యం ఎన్నో సమస్యలు. తరుచూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందులు, అనవసర వివాదాలు… ఇలా ఒకటేంటి పలు రకాల సమస్యలు, ఇబ్బందులు. వీటికి కారణం శనిదోషం కావచ్చు. ఒకవేళ మీ జాతక దశలు తెలిస్తే శనిదోషం ఉన్నా లేకుంటే పైన చెప్పిన బాధలు ఉంటే కింది తంత్రాలను ఆచరించండి తప్పక మీకు శని దోషాలు పోవడమే కాదు మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆలస్యమెందుకు వివరాలు చూద్దాం…
ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే.. గుడ అంటే బెల్లం సహిత తిలదాన, హోమ, జపాదులను చేయండి. శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవు. ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే ఏలినాటి శనిదోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధం, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగం దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగును. మయూరి నీలం ధరించుడం చేయండి తప్పక శనిదోష తీవ్రత తగ్గడం మంచి జరగడం జరుగుతుంది. ఒకవేళ మీకు నిజంగా పై పూజలు, తంత్రాలు చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే కింద చెప్పిన ఏదైనా ఒకదాన్ని చక్కగా భక్తితో, విశ్వాసంతో చేయండి తప్పక మీ దోషాలు పోతాయి. అవి ఏంటో చూద్దామా…
శని జపం ప్రతి రోజు జపించుట, శనికి తిలాభిషేకం చేయడం, శివునికి అభిషేకం ప్రతి శనివారం రోజు చేయడం చేయండి లేదా శనివారం రోజు నవగ్రహాల ఆలయ ప్రదక్షణలు, ప్రసాదం పంచుట, ప్రతిరోజు నువ్వుండలు కాకులకు పెట్టుట వలన, హనుమంతుని ఆకుపూజ చేయండి లేదా అవకాశం ఉంటే సుందరకాండ లేదా నలచరిత్ర చదువుకోండి తప్పక మంచి జరుగుతుంది. ప్రవహించే నీటిలో అంటే కాలువులు, నదుల్లో నల్లటి వస్తువులు అంటే బొగ్గులు, నల్ల నువ్వులు మేకు వేసి కాళ్లు కడుక్కోని దేవునికి మనస్సులో నమస్కారం చేసుకోవడం. శని 11 నామాలు చదవుకోండి ( శనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షణం చేయండి. నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం, ప్రతి శనివారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాళ్ల కు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన , అయ్యప్ప మాల ధరించుట వలన శ్రీ వేంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన శ్రీ వేంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన ప్రతి శనివారం వేంకటేశ్వర స్వామి,శివుని, హనుమంతుని దర్శనం, కాలభైరవ పూజ వల్లనూ వలన శని గ్రహ దోషం శాంతించి తప్పక మీకు మంచి జరుగుతుంది. ఇవీ కూడా వీలుకాకుంటే నల్లని చీమలకు కొన్ని బియ్యం గింజలను వేయండి, దశరథ శనిస్తోత్రాన్ని చదువుకోండి లేదా హనుమాన్‌చాలీసాను ప్రతిరోజు చదవండి తప్పక మీకు చెడుదోషాలు పోతాయి. విజయాలు చేకూరుతాయి.