హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అర్థరాత్రి బంజారా హిల్స్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే హరీశ్ రావు ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హరీశ్ రావును విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి తో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా హరీశ్ రావుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విడుదల చేశారు గచ్చిబౌలి పోలీసులు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టాలనే సీఎం రేవంత్ రెడ్డి పగబట్టాడు. పగ, ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఎక్కడ డబ్బులు సంపాదించాలి. ప్రతి పక్షాల పై పైచేయి సాధించాలని చూస్తున్నారు. లగచర్లలో మహిళలను అర్థరాత్రి ఎందుకు భయపెట్టారని ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ కలవడానికి కూడా రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. రైతు డిక్లరేషన్ లో తొమ్మిది హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి అన్నారు. పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు అన్ని కాంగ్రెస్ ఆఫీసుల్లా మారాయి.