నిర్మలమ్మ వ్యాఖ్యలతో కేసీఆర్ రైతు పక్షపాతి అని రుజువైంది : హరీశ్ రావు

-

మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మరోసారి ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీకి ఓట్లడిగే అర్హత లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని పునరుద్ఘాటించారు. మంగళవారం రోజున రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి కేసీఆర్‌ రైతు పక్షపాతి అని అర్థమయ్యిందని హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

“మోటార్లకు మీటర్లు పెట్టనందునే రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని నిర్మల సీతారామన్‌ చెప్పారు. రూ.25 వేల కోట్లు నష్టపోతాం అని తెలిసినా కేసీఆర్‌ మోటార్లకు మీటర్లు పెట్టలేదు. 65 లక్షల మంది రైతుల ప్రయోజనాల దృష్ట్యా మోటార్లకు కేసీఆర్‌ మీటర్లు పెట్టలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో సైతం మోటార్లకు మీటర్లు పెట్టాయి. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే రైతుల మోటార్లకు మీటర్లు పెడతారు. కర్ణాటకలో 5 గంటలే కరెంట్‌ ఇస్తున్నామని డీకే శివకుమార్‌ చెప్పారు. 24 గంటల నాణ్యమైన కరెంట్‌ కావాలంటే బీఆర్ఎస్​కు ఓటు వేయాలి. రైతుల పాలిట బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు శత్రువులు. రైతులకు మంచి జరగాలని యూపీఏ హయాంలో స్వామినాథన్‌ ఒక నివేదిక సమర్పించారు. ఇప్పటికీ స్వామినాథన్‌ నివేదికను కాంగ్రెస్‌, బీజేపీలు అమలు చేయలేదు.” అని హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news