రైతు గురించి ఆలోచించిన కేసీఆర్‌ను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణకు లేదా? : హరీశ్ రావు

-

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు పునరుద్ఘాటించారు. కేసీఆర్‌కు రైతుల కష్టం తెలుసు కాబట్టే మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలిపారు. రైతుల ప్రాణాలు కావాలా? పైసలు కావాలా? అని కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించారు. కర్షకులను ముంచడంలో కాంగ్రెస్‌, బీజేపీలు దొందూ దొందే అని విమర్శించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.

“కాంగ్రెస్‌, బీజేపీకి ఓటు వేయడం అంటే మోటార్లకు మీటర్లు పెట్టమని ఆహ్వానించడమే. రైతుల గురించి ఆలోచించిన కేసీఆర్‌ను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు లేదా? ఒకవేళ మీటర్లు పెట్టి ఉంటే రూ.25 వేల కోట్ల నిధులు వచ్చేవి కాదా? రూ.25 వేల కోట్ల నిధులు వచ్చింటే ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేసే వాళ్లం. కేవలం రైతుల ప్రయోజనాల దృష్ట్యా మీటర్లు పెట్టలేదు. దిల్లీలో మా ప్రభుత్వానికి బీజేపీ నేతల ప్రశంసలు.. గల్లీలో విమర్శలు” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news