కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో కరవు, కర్ఫ్యూ లేవు అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేశామని తెలిపారు. హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అంతర్జాతీయ అవార్డు సాధించామని వెల్లడించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ అద్భుతమైన వృద్ధిని సాధించిందని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. హైదరాబాద్‌లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పక్క రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని అన్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి బీజేపీ, కాంగ్రెస్ ఒకటయ్యాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు రాష్ట్ర ప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చని చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని.. దక్షిణ భారతదేశంలో తెలంగాణ అత్యధిక వృద్ధిరేటు సాధించిందని చెప్పారు. సంపదను పెంచుతాం… ప్రజలకు పంచుతామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు నినదించారు.