బూతులు మాట్లాడే నేతలకు పోలింగ్​ బూత్​లో ప్రజలు బుద్ధి చెబుతారు : హరీశ్ రావు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొంత మంది ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఉన్నత పదవిలో ఉన్న నేతలు ఇలా బూతులు మాట్లాడ్డం సరికాదని హితవు పలికారు. నేటి యువత ఇదంతా గమనిస్తోందని.. రాజకీయాలంటే బూతులు మాట్లాడటం కాదు.. భవిష్యత్​కు బాటలు వేయడం అని వాళ్లు తెలుసుకున్నారని హరీశ్ రావు అన్నారు. బూతులు మాట్లాడే నేతలకు పోలింగ్ బూత్​లో ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్​లో హరీశ్ రావు ప్రసంగించారు.

“రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేశాం. కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. మన ఊరు-మన బడి పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. విద్యారంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్ఎస్ భర్తీ చేసింది. ప్రైవేటు రంగంలో రాష్ట్ర యువతకు 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.” అని హరీశ్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version