కాంగ్రెస్ హవా కేవలం సోషల్ మీడియాలో మాత్రమే : కేటీఆర్‌

-

బీజేపీ సిద్ధాంతాలను రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రధాని మోదీని రేవంత్‌ ఒక్కసారి కూడా విమర్శించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ హవా అనేది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రమే ఉందని తెలిపారు. 80 సీట్లతో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో మైనార్టీలకు చాలా చేశామని… వారి మద్దతు తమకే ఉందని వెల్లడించారు. నల్గొండ జిల్లా మునుగోడులో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.

“ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్‌ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తాం. రైతుబంధు చెల్లింపులకు అనుమతివ్వాలని ఈసీని 2 సార్లు కోరాం. పీఎం కిసాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు? అసైన్డ్‌ భూములు ఉన్నవారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. తెల్లరేషన్‌ కార్డు ఉన్న వాళ్లందరికీ సన్నబియ్యం ఇస్తాం. తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన అభ్యర్థి బీజేపీలోకి వెళ్లారు. బీజేపీలోకి ఎందుకు వెళ్లారో మునుగోడు ప్రజలకు తెలుసు. 60 ఏళ్లపాటు మునుగోడును ఇబ్బందులకు గురిచేసింది ఎవరు? ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అడుగుతున్నారు.” అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news