తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎం), బీఎస్పీ, మిత్రపక్షం ఎంఐఎం వంటి పార్టీలు జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల ప్రధానంగా బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలు అధికార బీఆర్ఎస్ చాలా కీలకం కానున్నాయి. రకరకాలుగా ప్రచారం కొనసాగుతుంది తెలంగాణ ప్రభుత్వంపై. ఈ ప్రచారంలో భాగంగా ఇవాళ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యంగా కాంగ్రెస్ వల్లనే బీజేపీ గెలుస్తుందని హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియా
తో మాట్లాడారు. బీజేపీపై మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గాంధీ భవన్ రిమోట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ చేతి ఉందని సంచలన వ్యాక్యలు చేశారు. రేవంత్ రెడ్డి జీవితం ఆర్ఎస్ఎస్ తో నే ప్రారంభమైందని వెల్లడించారు. జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం బలమైన అభ్యర్థిని బరిలోకి దించిందని వెల్లడించారు.