సీఎం రేవంత్ నోరుజారినా.. రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం: హరీశ్‌రావు

-

ప్రాజెక్టులను అప్పగిస్తూ కేసీఆరే సంతకం చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. అసలు కేఆర్‌ఎంబీ సమావేశానికి కేసీఆర్‌ హాజరు కాలేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇంతకంటే అబద్ధాల ముఖ్యమంత్రి ఉంటారా? అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై కేసీఆర్‌ స్పందించ లేదని సీఎం చెప్పారని.. కానీ జీవో వచ్చిన వారం రోజుల్లో కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలపై స్టే తీసుకొచ్చిందే బీఆర్ఎస్ కదా? అని అన్నారు.

“సీఎం నోరుజారినా.. రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం. తెలంగాణ హక్కుల కోసం మేం పోరాడేందుకు సిద్ధం. మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే. ఉమ్మడి ఏపీలోనే తెలంగాణకు నీటి కేటాయింపులు ఎక్కువ అని ఉత్తమ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసం కదా?. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అన్యాయాలను కేసీఆర్‌ సరిచేశారు. విషయం తెలియనివాళ్లే.. విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు. 420 హామీలను చెప్పిన సమయానికి.. చెప్పినట్లు అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్‌ కావాలని కోరుకోలేదు.. ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్‌ నిన్న సన్నద్ధత కాకుండా మీడియా సమావేశం నిర్వహించారు. సన్నద్ధత కాకుండా వస్తే అడ్డంగా దొరికిపోతారు.” అని హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news