పొడుగు, పొడుగు అని అన్నందుకు రేవంత్ రెడ్డికి హరీశ్ రావు పొడుగైన గడ్డపార దింపాడని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి. వనపర్తిలో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రైతాంగ నిరసనకు వేలాదిగా తరలిరావడం చూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంత ఆగ్రహంగా ఉన్నారనే దానికి ఇదే నిదర్శనమన్నారు. ఒక్క దేవుడు కాదు.. రెండు దేవుళ్లు కాదు.. రాష్ట్రంలో అన్ని దేవుళ్ల మీద ఒట్టేసారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు. దేవుళ్లను కూడా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. ఇంత ఘోరంగా.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని.. హరీశ్ రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పొడుగు పొడుగు మాట్లాడాడు. హరీశ్ రాజకీయంగా నీ బట్టలూడదీసి నువ్వు చేసిన అబద్దపు హామీలను ఎంత తప్పో.. ప్రజలను మోసం చేశావో.. పొడుగున్నావు కాబట్టే కాంగ్రెస్ సర్కార్ కు పొడవైన గడ్డపార దింపి ఇయాళ చూపించాడు అని పేర్కొన్నారు సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి.