ఏపీ సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ..!

-

టీమిండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో సమావేశం అయ్యారు. ఏపీలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విస్తృత కార్యక్రమాల గురించి చర్చలు జరిగినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలపై కూడా సీఎం చంద్రబాబుకు చాలా ఉత్సుకత ఉందన్నారు. 

గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగిందని.. క్రికెట్ బోర్డు గా బాగా పని చేస్తోంది. చంద్రబాబు నుంచి ప్రామిస్ అనే కంటే ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది. ఇండియన్ గోల్ఫ్ కి నేను ప్రెసిడెంట్.. ఎక్కడ భూమి ఇస్తుందనేది ప్రభుత్వానిదే నిర్ణయం.. స్పోర్ట్స్ సిటీ ఇస్తే నేను చాలా సంతోషిస్తాను. 20 ఏళ్ల నుంచి క్రికెట్ లో ముందున్నామని తెలిపారు. చాలా పాజిటివ్ మాత్రమే తాను మాట్లాడుతానని పేర్కొన్నారు కపిల్ దేవ్.

Read more RELATED
Recommended to you

Latest news