సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పద్మారావు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో అరగంటకుపైగా ఈ సమావేశం జరిగింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. సీఎంతో మీటింగ్ కు గల కారణాన్ని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్య విషయంలో ముఖ్యమంత్రిని సంప్రదించినట్లు వారు వెల్లడించారు. ఆ నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని కోరామని చెప్పారు.

తమ విజ్ఞప్తిని మన్నించి రేవంత్ రెడ్డి..  వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఓ పేపర్ ఇచ్చి తమ పని చేయమని చెప్పారని బీఆర్ఎస్ నేతలు వివరించారు. “డీ లిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్ ను మేం బహిష్కరించాం. చెన్నైలో జరిగే సమావేశాన్ని కాంగ్రెస్ నిర్వహించడం లేదు. డీఎంకే పార్టీ వాళ్లు పిలిచారని మేం వెళ్తున్నాం. డీఎంకే మాకు సన్నిహిత పార్టీ. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పీసీ ఘోష్‌ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు. అది ఎప్పుడు వస్తుందో కూడా ఐడియా లేదు.” అని హరీష్ రావు మీడియా సమావేశంలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version