ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్ ఆదివాసీ భవన్‌లో ఆదివాసీ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన, స్త్రీ, శిశు శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ట్వీట్ చేశారు. మా తండాలో మా రాజ్యం కావాలనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చింది సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కుముంభీం పిలుపునిచ్చిన జల్.. జంగల్.. జమీన్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు నింపారని కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ, గిరిజనులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు భద్రాచలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటీడీఏ పీవో సిద్ధార్థ జైన్ పాల్గొన్నారు. పీవోను కొమ్ము నృత్యాలు, రేలా నృత్యాలతో ఆదివాసీలు అతిథులకు ఘనస్వాగతం పలికారు.
విధ్వంసపు దారుల నుంచి
వికసిత తోవలు,మోడువారిన బతుకుల్లో
మోదుగు పూల పరిమళాలు,మావ నాటే మావ రాజ్..
మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ గారు.జల్..జంగల్.. జమీన్ కొమురం భీము నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ గారు.
నేడు ప్రపంచ ఆదివాసీ… pic.twitter.com/vE4ztTzjer
— Harish Rao Thanneeru (@BRSHarish) August 9, 2023