రాత్రి 12 గంటల వరకు ఉంటా..అందరికీ సమాధానం ఇస్తా – హరీష్ రావు

-

రాత్రి 12 గంటల వరకు ఉంటా..అందరికీ సమాధానం ఇస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్‌ చేశారు. రాత్రి 12 గంటల వరకు టైమ్ ఇవ్వండి.. ఒక్కొక్క మంత్రికి సమాధానం చెప్పే సత్తా నాకున్నదని హరీష్ రావు వెల్లడించారు. మిడ్ మానేరు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టనని ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్‌ చేశారు.

harish rao

ఇది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. దీంతో శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ సర్కార్‌ విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి హరీష్ రావు మళ్లీ తన స్టైల్‌ లో రెచ్చిపోయారు. ప్రాణహిత చేవెళ్లకు నాలుగు జిల్లాలో శంకుస్థాపన చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శలు చేశారు. మొబలైజేషన్..సర్వే పేరుతో బిల్లులు ఎక్కువ ఎత్తారని ఆరోపణలు చేశారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version