సిద్ధిపేటకు స్వచ్ఛ అవార్డ్ వచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వచ్ సర్వేక్షన్ లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేట కు క్లిన్ సిటీ అవార్డ్ రావడంతో కార్మికులను సన్మానించారు మాజీ మంత్రి హరీష్ రావు.
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో సిద్దిపేటలేని అవార్డ్ లేదని..దేశంలోని 4477 మున్సిపాలిటీలలో సిద్దిపేట 9 స్తానంలో నిలిచి..దక్షిణ భారత దేశం లో మొదటి ప్లేస్ లో ఉందని వెల్లడించారు. సిద్దిపేటకి స్వచ్ఛ అవార్డ్ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయం అన్నారు. మున్సిపల్ కార్మికుల కృషివల్లే అవార్డ్ వచ్చింది..ఈ అవార్డ్ కార్మికులకు, ప్రజలకు అంకితమని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. 2012 నుంచి 2024 దాకా 22 అవార్డ్ లు సిద్దిపేట సొంతం అని వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు.