మేం నల్గొండలో సభ పెట్టినందువల్లే అసెంబ్లీలో తీర్మానం పెట్టారు: హరీశ్‌రావు

-

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలపై సత్యదూరమైన ప్రజెంటేషన్‌ ఇచ్చారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తాము కూడా ప్రజంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా స్పీకర్‌ అనుమతివ్వలేదని తెలిపారు. సభాపతి ఏకపక్షంగా మంత్రికే అవకాశం ఇవ్వడం సరికాదని హితవు పలికారు. నల్గొండలో రేపు బీఆర్ఎస్ సభ పెట్టినందు వల్లే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టిందని పేర్కొన్నారు.

కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకునేంత వరకు తాను మాట్లాడనని చెప్పడంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు. ప్రాజెక్టుల అప్పగింత కుదరదని కేసీఆర్‌ రెండో అపెక్స్‌ భేటీలోనే స్పష్టం చేశారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news