కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం లాగా లేదు.. మోడీని ప్రసన్నం చేసుకోడానికి రేవంత్ రెడ్డి తాపత్రయం పడుతున్నట్టు ఉందన్నారు హరీష్ రావు.

ఫార్మా సిటీ విషయంలో భూములు తిరిగి ఇచ్చేస్తాం అని వాళ్లను రెచ్చగొట్టారు కదా ఇప్పుడు అదనంగా కొత్తగా 15 వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి నువ్వు మనిషివా పశువువా అంటూ నిలదీశారు. మైనర్ పిల్లలను కూడా తిట్టిన చరిత్ర నీదంటూ ఆగ్రహించారు. అన్నం తినేవాడు వాడు ఎవరూ ఇలా మాట్లాడరని తెలిపారు.