కాంగ్రెస్‌ కు ఓటేయాలని టంగ్‌ స్లిప్‌ అయిన హరీష్‌ రావు !

-

కాంగ్రెస్‌ కు ఓటేయాలని టంగ్‌ స్లిప్‌ అయ్యారు సీనియర్‌ నాయకులు హరీష్‌ రావు. హుస్నాబాద్ కార్నర్ మీటింగ్ లో మాట జారారు హరీష్ రావు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల పేరు మీద బాండ్ పేపర్స్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే విధంగా మీరు ఇంటింటికి వెళ్లి చెప్పాలని పేర్కొన్నారు. బిజెపి ఆయన బండి సంజయ్ గారు బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు.

బొమ్మలకు కాదు ఓట్లు వేసేది పనిచేసే వారికి ఓటు వేయాలని కోరారు. బండి సంజయ్ కి ఓటు వేస్తే అంత ఉత్తదే అయిపోతదని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మన వినోద్ అన్నను ఆశీర్వదించడానికి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎస్టీ అక్కలు ఇవాళ కాంగ్రెస్ కు ఓటు వేయాలని మీ అందరిని కోరుతున్నాఅంటూ టంగ్‌ స్లిప్‌ అయ్యారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news