ఇక ముందు కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తాం: హరీశ్ రావు

-

Telangana: ఇప్పుడే ట్రైలర్ చూశారు.. ఇక కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరికలు జారీ చేశారు. పాత బస్తీ, తలాబ్ కట్ట హైదరాబాద్ లో నిర్వహించిన ముస్లిం మత పెద్దల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

harish rao

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మత పెద్దలను, ముస్లిం సోదరులను ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, దేశంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.

9 ఏళ్ల బి ఆర్ ఎస్ పాలనలో శాంతి యుతంగా ప్రజలు జీవించారని గుర్తు చేశారు. కేసీఆర్ గారు సెక్యులర్ లీడర్. తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతికి నిదర్శనం మన తెలంగాణ అన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news