కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ముఖ్యంగా రైతు భరోసా, ఆరు గ్యారెంటీలపై తొలి సంతకానికి సంబంధించి వీడియోలను మీడియాకి వినిపించారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను 100 రోజుల్లో అమలు చేస్తాం అని ఎన్నికల ముందు చెప్పారు.ప్రమాణ స్వీకారం రెండు రోజుల ముందే చేశారు. కానీ హామీల అమలు ను జాప్యం చేస్తున్నారు. రైతు బంధు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. రైతు భరోసా గురించి అసలు మాట్లాడట్లేదు. రాష్ట్రంలో తాగునీరు కొరత ఏర్పడింది. ఈ వంద రోజుల్లో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలిపారు. మేము గేట్లు ఎత్తితే BRS ఖాళీ అవుతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి.. ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. నాలుగు వేల పింఛన్ డిసెంబర్ నుంచే ఇస్తాం అని మోసం చేశారని గుర్తు చేశారు.