జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పొంగులేటితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖతో మాత్రమే గొడవలున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాన్ హటన్ భూమి ప్రభుత్వానిదే అన్నారు. ఆ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెల్లూరుకు చెందిన వ్యక్తికి కేటాయించారని తెలిపారు.
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతుందని.. అందులో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవీ రావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని ఏడాది క్రితం నారాయణపేట బహిరంగ సభలో చెప్పారని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని.. ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తారని.. మరోవైపు వాటిపై చర్యలు ఉండవని మండిపడ్డారు.