గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలు, మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజించాలని మోడీ చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన చేసి రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్టు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు గాడ్సె సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీని అడుగుపెట్టనివ్వమని కీలక ప్రకటన చేశారు. గతంలో బ్రిటీష్ వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టినట్టే బీజేపీని తరిమి కొట్టాలని ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు.