తెలంగాణలో మరో విషాదం చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే… గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. దీంతో ఇవాళ ఒక్క రోజే మొత్తం ముగ్గురు పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన వారే మరణించడం జరిగింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే… గుండెపోటుతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు.
స్థానికులు తెలిపిన వివరాలు.. భువనగిరికి చెందిన దోసపాటి బాలరాజు (35) హైదరాబాద్ మొదటి బెటాలియన్ యూసఫ్గూడలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండటంతో మార్గ మధ్యలో చనిపోయారు. బాలరాజు మృతితో బెటాలియన్లో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య సంఘటనలు కలకలం రేపుతున్నాయి. వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు కానిస్టేబుళ్లు సాయి కుమార్, బాలక్రిష్ణ. కొల్చారం పోలీస్ స్టేషన్ లో చేట్టుకు ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.