తెలంగాణలోని ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి, హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందుపరుస్తామని తెలిపారు. దీంతో ఏ ఆసుపత్రికి వెళ్లినా.. గతంలో ఎలాంటి వైద్యం అందించారు. ఇప్పుడు ఏం చేయాలనేది తెలుస్తాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

ముఖ్యంగా  ప్రపంచ దేశాల నుంచి చాలా మంది బెస్ట్ వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. మహానగరాలకు విద్య, వైద్యం, విద్యుత్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నారు. మెడికల్ టూరిజం హబ్ గా చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచన  ప్రభుత్వం చేస్తుంది. ఇందులో ప్రజల సహకారం కూడా ఉండాలన్నారు. హాస్పిటల్ కి ఎంత మంది వచ్చారన్నది కాదు.. ఆసుపత్రి నుంచి ఎంత మంది సంతోషంగా పోయారన్నది చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఏ పేదవాడు కూడా వైద్యం అందక చనిపోకూడదని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version