BRS ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఓ రావణాసురుడు – తెలంగాణ హెల్త్ డైరెక్టర్

-

 

BRS ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఓ రావణాసురుడు అంటూ ఇన్‌ డైరెక్ట్‌ గా కామెంట్స్‌ చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు… ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేసుకూంట.. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే.. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు… సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర అరోపణలు చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. దీంతో కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట తెరపైకి మరోసారి వచ్చింది. నిన్న శుక్రవారం పోడు భూముల పంపిణీకి పాల్వంచకు వస్తున్న మంత్రి హరీష్ రావు కోసం జీఎస్ఆర్ ట్రస్ట్ పేరిట గడల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను BRS ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదేశాలతో తీసేసింది మున్సిపల్ సిబ్బంది. ఈ తరుణంలోనే BRS ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఈ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news