కవిత ఈడీ ఛార్జిషీట్‌పై నేడు విచారణ

-

దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈరోజు (మే 14వ తేదీ 2024) విచారించనుంది. న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారమే దీనిపై విచారణ చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల మంగళవారానికి వాయిదా వేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కవితపై ఈ నెల 10వ తేదీన 200 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

అందులో గోవా ఆప్‌ అసెంబ్లీ ప్రచార వ్యవహారాలు చూసిన చారియట్‌ ప్రొడక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగులు దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌కుమార్‌, చన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు, ఇండియా ఎహెడ్‌ వార్తా ఛానల్‌ మాజీ ఉద్యోగి అర్వింద్‌ సింగ్‌లనూ నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్డు ఈరోజు విచారణ జరపనుంది.

Read more RELATED
Recommended to you

Latest news