శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

-

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాయ  విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శంషాబాద్ లో డ్రగ్స్, గోల్డ్ విపరీతంగా ఇతర దేశాల నుంచి భారతదేశానికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ లేదా డీఆర్ఐ అధికారులు చేపడుతున్నటువంటి తనిఖీలలో వారు పట్టుబడుతున్నారు. కొంత మంది చాకచక్యంగా ఎస్కేప్ కూడా అవుతున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తాజాగా బ్యాంకాకు నుంచి వచ్చిన ఇద్దరూ ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. అందులో ఓ వ్యక్తి వద్ద 13 హైడ్రోఫోనిక్ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరోవ్యక్తిని అవిచారిస్తున్నారు. సీజ్ చేసిన నిషేదిత పదార్థం యొక్క విలువ సుమారు రూ.13కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని డీఆర్ఐ అధికారులు సిబ్బందికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news