హైదరాబాద్ మహానగర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాదులో ఆకాశం మేఘావృతం అవుతుందని… సాయంత్రం పూట సిటీలో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.
అటు తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచనలు ఉన్నట్లు పేర్కొంది ఐఎండీ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోని..కొనసాగుతోంది. మరత్వాడ నుంచి దక్షిణ తమినాడు వరకు కర్ణాటక మీదుగా ద్రోణి..కొనసాగుతోంది.ఇక ఈ ద్రోణి ప్రభావంతో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది ఐఎండీ.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోని… కారణంగా తెలంగాణలో నేడు, రేపు పగటి ఉష్ణోగ్రతలు..తగ్గనున్నాయి. అటు ఉత్తర, ఈశ్యాన్య జిల్లాల్లకు వర్ష సూచనలు ఉన్నాయ్. హైదరాబాద్ లో నేడు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని పేర్కొంది ఐఎండీ.