ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు

-

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అయిందని అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో అత్యధికంగా 12 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. చిట్కుల్ లో 11.7, నర్సాపూర్ 10, వెల్దుర్తి లో 10 సెం. మీ భారీ వర్షపాతం నమోదు అయిందని అధికారులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా లక్ష్మీ సాగర్ లో 11.7 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.

సంగారెడ్డి 10, కొండాపూర్ 9.7, ఆందోల్ 9 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా రాఘవపూర్ లో 9.7 సెం. మీ వర్షపాతం నమోదు అయిందని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. నారాయణరావుపేటలో 9.4, తొగుటలో 7.8 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. ఇక అటు నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు పోటెత్తింది వరద. పూర్తిగా నిండుకుంది ఎస్సారెస్పీ. ఇన్ ఫ్లో 114038 క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news