BREAKING : హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో 3 గంటల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేశారు. గంట పాటు భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది జీహెచ్‌ఎంసీ.
కాగా తెలంగాణ వ్యాప్తంగా గత రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లో హెచ్చరికలు జారీ అయిన జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ ఉన్నాయి.