ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మళ్లీ వర్షాలు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న వారికి వాతావరణ శాఖ ఈ సందర్భంగా శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు.. ఏర్పడబోతున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.

దీని ప్రభావంతో ఈనెల 17వ తేదీన నైరుతి బంగాళాఖాతం లో అల్ప పీడనం ఏర్పడుతుందని స్పష్టం చేసింది. దీనికి తోడు తూర్పు అలాగే పడమర ద్రోని ఒకటి విస్తరిస్తుందని తెలిపింది. అప్పటినుంచి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు పడతాయని వెల్లడించింది. తెలంగాణ తో పాటు కోస్తా అటు రాయలసీమ ప్రాంతాల్లో ఈనెల 18వ తేదీ నుంచి భారీ వర్షాలు పడతాయని సూచనలు చేసింది.