Heavy Rains In Sangareddy: సంగారెడ్డి..మరోసారి నీట మునిగింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన 10 సెం. మీ భారీ వర్షానికి అతలాకుతలమైంది సంగారెడ్డి టౌన్. రెండు గంటలు ఏకధాటిగా కురిసిన వర్షానికి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి లోతట్టు ప్రాంతాలు. దీంతో విద్యుత్ సరఫరా..రాత్రంతా నిలిచిపోయింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై వరదలో బస్సు చిక్కుకుపోగా..ఓ బైక్ .కొట్టుకుపోయింది.

బస్సు నుంచి బయటికి రావడానికి నానా తంటాలు పడ్డారు ప్రయాణికులు. వరదతో కొట్టుకుపోతున్న బైక్ ని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడ్డారు యువకులు. అపార్ట్ మెంట్ లలోకి నీరు చేరడంతో మోటార్లు పెట్టి బయటికి తీసారు. గత నెల సెప్టెంబర్ మొదటివారంలోను భారీ వర్షాలతో నీటమునిగిన సంగారెడ్డి..మరోసారి నీట మునిగింది. రోడ్డుపై భారీగా వరద రావడంతో పేరుకుపోయాయి ఇసుకమేటలు.