Heavy rains to continue in Telangana for another 4 days: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కొడుతున్నాయి. అర్ధరాత్రి కూడా చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో… జోరుగా వర్షాలు పడ్డాయి. ఇంకా కొనసాగుతున్నాయి. మరో నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో…. వర్షాలు భారీగా పడతాయని తెలిపింది. అదిలాబాదు, కొమురం భీమ్, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఇక ఆటో హైదరాబాద్ మహానగరంలో కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో… ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది