Telangana : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేయగా…. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అటు కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, భూపాలపల్లి, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండనుంది. భారీ వర్షాల కారణంగా ఇవాళ మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.