BRS ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై నేడు హైకోర్టు విచారణ జరుపనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేల పిటిషన్ ల పై నేడు హైకోర్టు విచారణ చేయనుంది.
బీఆర్ఎస్ పార్టీ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లారు ఎమ్మెల్యేలు. ఈ తరుణంలోనే… ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీంతో
నేడు ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు విచారణ జరుపనుంది. మరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో చూడాలి.