గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమని వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. ఈ తరుణంలోనే.. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేసింది. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.
దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ కు బిగ్ షాక్ తగిలినట్లైంది. ముందు చెప్పినట్లుగానే కోదండరాంను బలి పశువు చేశారని రేవంత్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేసిన హైకోర్టు….మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని తీర్పు ఇచ్చింది.