బిఆర్ఎస్ ఎంపీ కొడుక్కి బిజెపిలో ఎంపీ టికెట్.. పాలమూరు జిల్లాలో ఏం జరుగుతోంది..?

-

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జపాంగ్ లు ఎక్కువ అవుతున్నారు.. టిక్కెట్ హామీ రాకపోతే చాలు పక్క పార్టీలోకి దూకెందుకు సిద్ధమవుతున్నారు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ వ్యవహారం మరింత ఎక్కువైంది. తెలంగాణలో ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న బిజెపి..ఉమ్మడి పాలమూరు జిల్లాపై కమలం పార్టీ గురి పెట్టింది.. ప్రతిపక్ష హోదాలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలని కమలం గూటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. నాగర్ కర్నూల్ ఎస్సీ లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా.. BRS ఎంపీ రాములు కొడుకు భరత్ ప్రసాద్ పేరును బీజేపీ ప్రకటించింది..

నాగర్ కర్నూల్ అభ్యర్థిని ఇతర పార్టీల కంటే ముందుగా బిజెపి ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.. వివాద రైతులు సౌమ్యలుగా పేరు ఉన్న రాములు ఇటీవలే టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు.. ఈ క్రమంలో ఆయన తనయుడికి నాగర్ కర్నూల్ టికెట్ ను ఇప్పించుకున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాములు.. ఓసారి మంత్రిగా పనిచేసి గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగి గెలుపొందారు. అయితే తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని రాములు గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో అసంతృప్తితో ఉన్నారు.. తన కుమారుడు భరత్ కి నామినేటెడ్ పదవి ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరిన అటు పక్కనుంచి స్పందన రాకపోవడం.. తనను బాధించిందని అనుచరుల వద్ద ఆయన చెప్పుకున్నారట.. దీంతో గత కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి అచ్చంపేట టిక్కెట్ ఇవ్వాలంటూ కోరినా కూడా అధిష్టానం ఆయనకు మొండి చెయ్యి చూపింది.

అచ్చంపేట నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించి సమీక్ష సమావేశాలు నిర్వహించిన.. వాటికి కూడా రాములు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారు అంటూ ప్రచారం జరిగిన టిఆర్ఎస్ నేతలు పట్టించుకోకపోవడంతో.. తన కుమారుడు భరత్ తో పాటు ఆయన మూడు రోజుల క్రితం కమలం గూటికి చేరారు. నాగర్కర్నూల్ ఎస్సీ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో.. మోడీ చరిష్మా కూడా కలిసొచ్చి తన కుమారుడు మంచి మెజార్టీతో గెలుపొందుతారని రాములు భావిస్తున్నారట.. ఈ పరిణామాలను గమనించిన బీజేపీ నేత శృతి.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.. శృతి పార్టీ వీడిన.. బిజెపి కి వచ్చే నష్టమేమీ లేదని.. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ కచ్చితంగా గెలిచి తీరుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా నాగర్ కర్నూల్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు రత్తికట్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news