ఆరోగ్యానికే అధిక ప్రాధాన్య‌త : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వైద్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు ఉద‌హార‌ణాలు కూడా చాలా ఉన్నాయని ఆయ‌న అన్నారు. బాలా న‌గ‌ర్, కోయిల్ కొండ ప్రాంతాల‌లో ఉండే ఆస్ప‌త్రుల పాత భ‌వ‌నాలు మ‌రియు కొత్త భ‌వ‌నాల ఫోటో ల‌ను ట్విట్ట‌ర్ లో మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. బాలా న‌గ‌ర్, కోయిల్ కొండ ప్రాంతాల‌లో శిథిలావ‌స్థ‌లో ఉన్న ఆస్ప‌త్రులు ఆధునిక హంగుల‌తో తీర్చి దిద్దారు.

దీంతో ఆ ఫోటో ల‌ను త‌న అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా పంచుకుని త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని కామెంట్ రాశారు. అలాగే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ కృషి కి ప‌ని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావుకు ధ‌న్య‌వాదాలు అంటూ రాసుకు వ‌చ్చారు. అలాగే జ‌డ్చ‌ర్ల‌, నారాయణ‌పేట్ ఎమ్మెల్యే ల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news