జులై 24న హిమాన్షు సెకండ్ సాంగ్ రిలీజ్.. కేటీఆర్ రియాక్షన్ ఏంటంటే..?

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడిగా.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనయుడిగా.. కల్వకుంట్ల హిమాన్షు గురించి అందరికీ తెలుసు. తాత, తండ్రిలాగే హిమాన్షు కూడా రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకుంటున్నారు. హిమాన్షు కూడా అప్పుడప్పుడు పార్టీ కార్యకలాపాల్లో కనిపిస్తూ.. సామాజిక సేవల్లో పాల్గొంటుండటం వల్ల కల్వకుంట్ల వారసుడిగా రాజకీయాల్లోకి హిమాన్షు ఎంట్రీ తథ్యమని భావిస్తున్నారు.

అయితే హిమాన్షు రాజకీయాలపైన తన ఆసక్తి గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ తనకు మ్యూజిక్​పై మాత్రం ఇంట్రెస్ట్ ఉందని చాలాసార్లు చెప్పాడు. ఇప్పటికే గోల్డెన్ అవర్ అనే ఇంగ్లీష్ సాంగ్ కవర్ కూడా పాడి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ పాటకు మంచి స్పందనే వచ్చింది. రాజకీయ, సినీ ప్రముఖులు హిమాన్షు టాలెంట్​ను తెగ పొగిడేశారు.

అయితే ఇప్పుడు తన సెకండ్ సాంగ్​ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడట హిమాన్షు. అదే విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. తన సెకండ్ సాంగ్​ను జులై 24వ తేదీన విడుదల చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్​కు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుందా అని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news