రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

-

 తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వాన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పనుల మీద బయటకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. చాలా వరకు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉండటం వల్ల శనివారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు జులై 22(శ‌నివారం)న కూడా అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తూ విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అన్ని జిల్లాల డీఈవోల‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయాన్ని మెసేజ్ రూపంలో ముందుగానే చేరవేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news