ఏపీలో దారుణం జరిగింది.. జనసేన నాయకుడిపై కత్తితో దాడి జరిగింది . స్థల వివాదంలో జనసేన నాయకుడిపై కత్తితో దాడి చేసాడు వైసీపీ నాయకుడు . విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ స్థలాన్ని గతంలో స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించి, స్థానికుడైన వైసీపీ నాయకుడు అక్కునాయుడుకు అమ్మాడు . ఈ స్థలంలో అక్కునాయుడు పండ్ల దుకాణం పెట్టాడు.. గతంలోనే ఈ స్థలంపై గొడవ నడవగా, కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.

అయినా కూడా పట్టించుకోకుండా అక్కునాయుడు పండ్ల దుకాణం ఏర్పాటు చేయడంపై, స్థానిక జనసేన నాయకుడు మహంతి ధనంజయ ఆదివారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు . స్టేషన్ నుంచి ఇంటికి వెళుతున్న ధనంజయపై ఆదివారం రాత్రి అక్కునాయుడు కత్తితో తల పైన, వీపు పైన తీవ్రంగా గాయపరిచాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ధనంజయ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయనగరం ఆసుపత్రికి తరలించారు . ధనంజయపై దాడి చేసిన అనంతరం అక్కునాయుడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
స్థల వివాదంలో జనసేన నాయకుడిపై కత్తితో దాడి చేసిన వైసీపీ నాయకుడు
విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ స్థలాన్ని గతంలో స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించి, స్థానికుడైన వైసీపీ నాయకుడు అక్కునాయుడుకు అమ్మాడు
ఈ స్థలంలో అక్కునాయుడు పండ్ల దుకాణం పెట్టాడు.. గతంలోనే ఈ… pic.twitter.com/5tZb3zqSZU
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2025