నిన్నటి నుండి హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని డ్యామ్ లు, ప్రాజెక్టు లు అలాగే చెరువులు కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అలాగే హైదాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం పెరుగుతోంది. అయితే మాములుగా హుస్సేన్ సాగర్ FTL సాధారణంగా 513.40 ఉండాలి. కానీ హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కు దాటేసింది. ప్రస్తుతం FTL 513.75 కి చేరుకుంది.
అయితే ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న తూములను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. కానీ హైదరాబాద్ లో వర్షం తగ్గే విధంగా కనిపించడం లేదు, మరో రేడు రోజులు వర్షాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో హుస్సేన్ సాగర్ లో మరింత నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని అలెర్ట్ చేసాయి GHMC, DRF టీమ్స్.