ఏపీలో వరద పరిస్థితిపై కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన అనంతరం కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చించారు. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు తెలిపారు హోం సెక్రటరీ.
ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది.. ఒక్కో టీమ్ వద్ద నాలుగు పవర్ బోట్లు ఉంటాయి. ఇవన్నీ రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని తెలిపిన హోం సెక్రటరీ.. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపారు. వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ… సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయి.