హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులు వేగవంతం అయ్యాయి. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని మెట్రో వర్గాలు పకడ్బందీగా టెండర్ నిబంధనలు రూపొందించాయి. ఈ టెండర్లో షరతులు కఠినంగా ఉన్న నేపథ్యంలో బిడ్డింగ్‌కు అర్హత సాధించే సంస్థలు తక్కువగా ఉంటాయని ఇన్ఫ్రా వర్గాల్లో టాక్.
బిడ్‌లో పాల్గొనేందుకు రూపొందించిన షరతులు ఇవే..
బిడ్‌లో పాల్గొనాలంటే ఇది వరకు 30 కి.మీ. మెట్రో రైలు పనులు చేపట్టిన అనుభవం ఉండాలి.
పనులను దక్కించుకున్నాక.. సివిల్ వర్క్స్‌ను సబ్ కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు అనుమతి లేదు.
మెట్రో ఆపరేషన్స్‌లో కనీసం మూడేళ్ల అనుభవం అవసరం.
పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయకపోతే రూ.500 కోట్లు జరిమానా చెల్లించాలనే నిబంధనలను హెచ్‌ఏఎంఎల్ నిర్దేశించింది.
ప్రాజెక్ట్ వ్యయం రూ.6,250 కోట్లు కాగా, మెట్రో నిర్మాణ వ్యయం రూ.5,688 కోట్ల అంచనాతో గ్లోబల్ టెండర్లను సంస్థ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జులై 5 తుది గడువు. ఇప్పటివరకు పెద్దగా బిడ్లు దాఖలు కాలేదు. సెలవు రోజులు మినహాయిస్తే మరో 5 రోజుల మాత్రమే గడువు ఉంది.