డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదు.. గంజాయి నిర్మూలనకు కృషి చేస్తా : సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

-

రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని హైదరాబాద్ నూతన సీపీ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారికి హైదరాబాద్‌లో చోటు లేదని తేల్చి చెప్పారు. బార్లు, పబ్‌లు, ఫామ్‌హౌస్‌లకు డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

“డ్రగ్స్‌ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారు. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటాం. ఉద్దేశపూర్వక నేరాలు చేసేవారితో చాలా కరకుగా ఉంటాం. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తోంది. సినీ పరిశ్రమలో డ్రగ్స్ మూలాలు ఉంటే సహించేది లేదు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సినిమా పెద్దలతో సమావేశాలు జరుపుతాం. నా పై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. హైదరాబాద్ కమిషనరేట్ అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అందరి అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేస్తాను. ప్రజలకు వేగంగా సేవలు అందిచేదుకు, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.” అని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news