Telangana: ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే!

-

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్…ఇక ఈ ముచ్చటే బంద్‌ కానుంది. ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లేనని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2 తారీకున ముగియనుంది.

Hyderabad is no longer the common capital

దీంతో హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏపీకి మార్చబడుతున్నాయి.. 2016లో 90% కార్యాలయాలు తెలంగాణ నుండి ఏపీకి మారగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి కర్నూలుకు మార్చారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిలిచిపోయే జూన్ 2వ తేదీలోపు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నింటినీ ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఏపీఈఆర్‌సీ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జ్యూడిషల్ కాపిటల్ సిటీ అయిన కర్నూల్ కు ఏపీఈఆర్‌సీ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా గత సంవత్సరం సీఎం జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, కార్యాలయాలను ఏపీకి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లేనని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news