తెలంగాణ మందుబాబులకు షాక్‌..ఇవాళ్టి నుంచి రెండు రోజులు వైన్స్‌ బంద్‌ !

-

 

 

తెలంగాణ మందుబాబులకు షాక్‌..ఇవాళ్టి నుంచి రెండు రోజులు వైన్స్‌ బంద్‌ కానున్నాయి. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. నేటి సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్‌ కానున్నట్లు పేర్కొన్నారు.

Wine shops to be closed on tues day

ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (వరంగల్, హనుమకొండ, జనగామ) ప్రశాంతమంతమైన వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ ఉత్తర్వులమేరకు నేటి సాయంత్రం 5 గంటల నుంచి 27వ తేది సాయంత్రం 6 గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాల్సిందిగా ఉత్తర్వుల్లో తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news